/rtv/media/media_files/2025/04/17/F19JwSWlJIm7StJQZS2X.jpg)
VRO and Tahasildar
ప్రజల కోసం సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు కక్కుర్తి కోసం లంచాలు అడగడం సాధారణమైపోయింది. ఇందులో కొందరు ఏసీబీ అధికారులకు చిక్కుతారు, మరికొందరు దర్జాగా లంచాలు తీసుకుంటూనే ఉంటారు. భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్వో, తహశీల్దార్ చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.
Also Read: భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
VRO And Tahsildar Case
ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంజమ్మ 6 నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందారు. ఆమె పేరు మీదున్న ఆస్తులను తన పేరుపై మార్చేందుకు భర్త వల్లెపు అంకమ్మరావుకు డెత్ సర్టిఫికేట్ అవసరం వచ్చింది. ఇందుకోసం అతడు స్థానిక వీఆర్వో కొప్పోలు అంకమ్మరావును సంప్రదించారు. అయితే ఆ వీఆర్వో లేట్ డెట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీలుందని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు.
Also Read: చైనాకు మరో బిగ్ షాక్.. 245 శాతం టారిఫ్ విధించిన ట్రంప్ సర్కార్
చివరికీ రూ.90 వేలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో తహశీల్దార్ సుజన్‌కుమార్‌తో వీఆర్వో ఫోన్ మాట్లాడించారు. ఇక చివరికీ బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. వీఆర్వో కొప్పోలు అంకమ్మరావు లంచం తీసుకుటుండగా వాళ్లు అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత తహశీల్దార్ సుజన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి
Also Read : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్
telugu-news | rtv-news | bribe | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu