US- China Tariff: చైనాకు మరో బిగ్ షాక్.. 245 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌ సర్కార్

అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ మరింత ముదురుతోంది. తాజాగా అమెరిగా చైనాపై ఏకంగా 245 శాతం టారిఫ్‌ విధించింది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం.. చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 245 శాతం టారిఫ్‌ విధించింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ మరింత ముదురుతోంది. తాజాగా అమెరిగా చైనాపై ఏకంగా 245 శాతం టారిఫ్‌ విధించింది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం.. చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకం పెంచింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వ్యవస్థల మధ్య ముదిరిన ట్రేడ్‌ వార్‌ ఇంకా ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాపై ఏకంగా 245 శాతం టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..

ఇప్పటికే అమెరికా చైనాపై టారిఫ్‌లు పెంచుకుంటూ వస్తుంటే.. చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికాపై సుంకాలు పెంచుతోంది. ఇప్పుడు అమెరికా 245 శాతం విధించడంతో.. మళ్లీ చైనా అమెరికాపై ఎంతవరకు సంకాలు విధిస్తుందోనన్న ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ టారిఫ్‌ల ప్రభావం వల్ల అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల రేట్లు ఆకాశానికి తాకనున్నాయి. 

Also Read: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

అమెరికా, చైనా సుంకాల విషయంలో ఒప్పందానానికి రానున్నాయనే ప్రచారం వచ్చిన నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం అందిరినీ షాక్‌ అయ్యేలా చేసింది. మరోవైపు అమెరికా సుంకాల వల్ల తమ ఆర్థిక వృద్ధి మెరుగ్గానే ఉందని చైనా చెబుతోంది. మొదటి త్రైమాసికంలో తమ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసినటువంటి 5.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పింది. అమెరికా కొత్త సుంకాలు విధించకముందే ఎగుమతిదారులు వస్తు సరఫరాలను పెంచడం వల్ల ఇది సాధ్యమైందని తెలిపింది. 

ఇరుదేశాలు ఇలా భారీగా ఒకదానికొకటి సుంకాలు విధించుకుంటున్న నేపథ్యంలో.. చైనా తమ దేశంలో లభించే అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడం నిలిపివేసింది. దీనికి సంబంధించి  వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ కూడా స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రావాల్సింది చైనానే అని తెలిపారు. తమకు దీనిపై ఎలాంటి అవసరం లేదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు