BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్

టీమిండియా జట్టు సహాయక సిబ్బంది నుంచి నలుగురును తొలగిస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఒక మసాజర్‌ను బీసీసీఐ తొలగించింది.

New Update
BCCI

BCCI

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా జట్టులో సహాయక సిబ్బంది నుంచి నలుగురును బీసీసీఐ తొలగించింది. ఇందులో గౌతమ్ గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. అయితే అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఒక మసాజర్‌ను బీసీసీఐ తొలగించింది. గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పుడు అభిషేక్ నాయర్ సహాయక సిబ్బందిలో పాల్గొన్నాడు.

ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

గంభీర్ సన్నిహితుడు కూడా..

జట్టులో అసిస్టెంట్ కోచ్ బాధ్యతలను అభిషేక్ నాయర్ నిర్వర్తించాడు. అభిషేక్ నాయర్ 2024 జూలై 24న టీం ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. అయితే ఆస్ట్రేలియాలో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌ లీక్‌ల నేపథ్యంలో వీరిపై వేటు పడింది. అభిషేక్ నాయర్‌తో పాటు, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్, మసాజర్ (ఫిజియో సపోర్ట్ స్టాఫ్)ను కూడా బీసీసీఐ తొలగించింది. 

ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

గతేడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవీకాలం ముగిసింది. దీంతో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అయితే టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమిని చవిచూసింది. ఈ కారణాల వల్ల సపోర్ట్ టీం నుంచి వీరిని తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే అభిషేక్ నాయర్ పదవి కాలం ముగియడంతో తొలగించినట్లు తెలుస్తోంది. ఇండియా కొత్త సపోర్ట్ స్టాఫ్‌ను జూన్ 20లోపు తీసుకుంటుందట. జూన్ 20న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు టీమిండియా కొత్త సపోర్ట్ స్టాఫ్‌ను తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్

 

gautham-gambhir | teamindia

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు