AP: ఏపీలో 16మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్లో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ IPS, సీఐడీ ఐజీగా వినీత్ బిజ్రాల్ను నియమించారు.
ఆంధ్రప్రదేశ్లో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ IPS, సీఐడీ ఐజీగా వినీత్ బిజ్రాల్ను నియమించారు.
గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు.
ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ కనక దుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత మెట్లను శుభ్రం చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్ బస్సులో ఓ మహిళ పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగింలా? వద్దా? అన్న అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో వందల ఆలయాలు అపవిత్రం అయ్యాయన్నారు. అయోధ్యకు కల్తీ చేసిన లక్ష లడ్డూలు పంపించారని ఆరోపించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత పనులు సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు అధికారులు రెండు బోట్లను వెలికితీశారు. అయితే తాజాగా దాదాపు 40 టన్నుల బరువున్న మూడో బోటును కూడా విజయవంతంగా బయటకు తీశారు.