Vijayawada: దుర్గతులను తొలగించే దుర్గమ్మ దర్శనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది.

New Update
gurgamma

Gurgamma

AP News: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మను దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు బారులుదీరారు. క్యూలైన్‌లన్నీ కిక్కిరిసిపోయాయి. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది. అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీలు సైతం అధిక సంఖ్యలో కొండకు చేరుకున్నారు. అధికారులు భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గతలను పోగొట్టే దుర్గాదేవిని ఈ రోజు దర్శించుకుంటే కష్టాలన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అందుకే కొండకు భక్తజనం పోటెత్తుతున్నారు.

కష్టాలను వెంటనే దూరం చేస్తుందని..

ఆదిపరాశక్తి ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని వధించారని పురాణాల్లో ఉంది. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో తొలిరూపం దుర్గ. భవబంధాలలో ఉన్న మానవుడిని అనుగ్రహించి మోక్షం ప్రసాదించే మాతగా చెబుతారు. కోటి సూర్యప్రభలతో వెలిగొందే ఈ అమ్మను పూజిస్తే శత్రుపీడనం పోతుంది. ఎర్రని వస్త్రం అమ్మవారికి పెట్టి..అక్షింతలు, ఎర్రని పూలతో కొలిస్తే ఎంతో శుభం కలుగుతుంది. అంతేకాకుండా రాహు దోషాలను నివారిస్తుందని, కష్టాలను వెంటనే దూరం చేస్తుందని నమ్మకం. ఓం దుర్గ దుర్గాయ నమః అంటూ జపిస్తే శత్రు బాధల నుంచి విముక్తి కలిగి సంతోషంగా జీవిస్తారని ప్రతీతి. అయితే ఎనిమిదో రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ దేవిని పూజిస్తారు. ఈ రోజు మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగుతో అలంకరిస్తారు.

ఇది కూడా చదవండి: ధర 99..999 ఎందుకు పెడతారు?.. ఆ రూపాయి ఏమైంది సార్‌?

Advertisment
Advertisment
తాజా కథనాలు