AP News: కాశ్మీర్‌లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు!

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి మెజార్టీ దక్కడంతో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తామని పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు.

New Update
Congress leader Sunkara Padma Shri

Congress Leaders

AP News: జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.  బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు సుంకర పద్మశ్రీ. ఈ సందర్భంగా పద్మశ్రీ  మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశం మొత్తం భారతీయ జనతా పార్టీని శాశ్వతంగా పారదోలే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నిద్రపోతుందని.. నిత్యావసరాలు పెరిగితే  నాయకులు  ఏం చేస్తున్నారని పద్మశ్రీ ప్రశ్నించారు. 

ప్రజలకు సేవ చేయకుండా సీఎంకు సేవచేస్తున్నారు:

ఉల్లిధర చూస్తే మహిళలకు కళ్ళ వెంట కన్నీళ్లు వస్తున్నాయని.. మందు ధర తగ్గించి అందరిని తాగి ఊగమనేలా కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో కనిపించని పరిస్థితి ఏర్పడిందన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో గెలిచి గన్నవరం ప్రజలకు సేవ చేయకుండా సీఎం చంద్రబాబుకు సేవచేస్తున్నాడని మండిపడ్డారు.  వరద సమయంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం వైపు చూడని పరిస్థితి ఉందన్నారు. ముత్తైదువులు శుభ్రం చేసే గుడి మెట్లను పవన్ శుభ్రం చేశారని ఆరోపించారు. మద్యం టెండర్లలో మాకు కూడా వాటా కావాలని జనసేన నాయకులు ఫేస్‌బుక్‌ లైవ్ ఇస్తుంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఇది తింటే గడ్డకట్టే చలిలో కూడా వణుకు ఉండదు

Advertisment
తాజా కథనాలు