మహిళలకు గుడ్‌ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

దేశీయంగా ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.

New Update
FotoJet (10)

దేశంలో ఏ చిన్న శుభకార్యమైన తప్పకుండా బంగారం, వెండి ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు అయితే మిస్ కాకుండా వీటిని వాడుతారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలోని మహిళలు బంగారం ఆభరణాలు ధరించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందులో పండుగలు ఏవైనా వచ్చాయంటే వీటి డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఈ దసరా పండుగ వేళ బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరగడం లేదు.

ఇది కూడా చూడండి: ఈ దుస్తులు ధరించి.. నవరాత్రుల పూజ చేస్తే అంతా మంచే!

స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా..

అంతకుముందు భారీగా పెరిగిన బంగారం అక్టోబర్ 7 నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు మళ్లీ బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ రోజు తులం బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 71 వేలు ఉండగా.. 24 క్యారెట్స్ ధర తులం రూ. 77,450 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాములు రూ. 71,150 ఉంది. అదే 24 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 77,600 వద్ద ఉంది.

ఇది కూడా చూడండి: సీఐ తల్లి హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడిని స్విగ్గీ ఎలా పట్టించిందంటే?

గత 10 రోజుల నుంచి వెండి ధరలు తగ్గడంలేదు. కిలో వెండిపై నిన్న రూ.900 తగ్గగా ఈ రోజు భారీగా వెండి రేట్లు కూడా తగ్గాయి. నేడు రూ.2000 తగ్గి మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.94,000గా ఉంది. అయితే తక్కువగా బెంగళూరులో కిలో వెండి 88 వేలు ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో రూ.1000 తగ్గగా కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉంది. హైదరాబాద్‌లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. 

22 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.70,300
విజయవాడ – రూ.70,300
ఢిల్లీ – రూ.70,450
చెన్నై – రూ.70,300
బెంగళూరు – రూ.70,300
ముంబై – రూ.70,300
కోల్‌కతా – రూ.70,300
కేరళ – రూ.70,300

24 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.76,690
విజయవాడ – రూ.76,690
ఢిల్లీ – రూ.76,840
చెన్నై – రూ.76,690
బెంగళూరు – రూ.76,690
ముంబై – రూ.76,690
కోల్‌కతా – రూ.76,690
కేరళ – రూ.76,690

కిలో వెండి ధరలు

హైదరాబాద్ – రూ.1,01,900
విజయవాడ – రూ.1,01,900
ఢిల్లీ – రూ.95,900
ముంబై – రూ.94,000
చెన్నై – రూ.1,00,000
కోల్‎కతా – రూ.94,000
బెంగళూరు – రూ.88,000
కేరళ – రూ.1,01,900

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు