మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.

New Update
seventh day

తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఆహార నియమాలు పాటిస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కొలుస్తారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతీ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. 

ఇది కూడా చూడండి: మెషీన్‌ లెర్నింగ్‌ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

తెల్లని వస్త్రం సమర్పించి..

ఏడవ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారు శ్రీ సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విద్య, కళలో రాణిస్తారని భక్తులు నమ్ముతారు. అమ్మవారికి ఈ రోజు తెల్లని వస్త్రం సమర్పించి.. పగడాల హారం, స్వర్ణ హస్తాలు, బంగారు వీణ, వడ్డాణంతో అలంకరిస్తారు. ఈరోజు మూల నక్షతం కావున చదువుల తల్లి సరస్వతి దేవీని అందరూ కొలుస్తారు. హంస వాహనంపై ఉండే అమ్మవారిని పూజించి దద్దోజనం, కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి.

ఇది కూడా చూడండి: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి తప్పని తిప్పలు!

అమ్మవారిని ఇలా పూజ చేయడం వల్ల పిల్లలకు చదువు బాగా వస్తుందని భక్తులు నమ్ముతారు. సాధారణంగా నవరాత్రుల సమయంలో విజయవాడ అమ్మవారిని చూడటానికి భక్తులు పోటెత్తుతారు. అందులో ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో భక్తల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజు భారీ సంఖ్యలో కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఆలయంలోని అన్ని క్యూలైన్లు కూడా నిండిపోయాయి. 

ఇది కూడా చూడండి: సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు