AP: ముంచుకొస్తున్న అల్ప పీడనం..24 గంటల్లో భారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌

Heavy Rains: 

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం నుంచి ఇవి క్రమంగా వైదొలగనున్నాయి. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, అసోం, మేఘాలయ, అరుణాచల్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర ల మీదుగా బంగాళాఖాతంలోకి చేరనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతదేశం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో , బంగాళాఖాతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడనుంది. దీని కారణంగా రాలసీమ, కోస్తాంధ్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.  ఈనెల 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని...దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు సంభవించొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లు పటిష్టం చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 

Also Read: అక్టోబర్ 7కు హమాస్ చాలా పెద్ద కుట్రే  చేసింది‌‌–వాషింగ్టన్ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు