AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

New Update
rains ap

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. 

ఇది కూడా చూడండి:  వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను

అల్పపీడన ప్రభావం వల్ల ఈ జిల్లాల్లో..

అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

ఇది కూడా చూడండి:  శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్

ఇది కూడా చూడండి: ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రైతులకు సూచనలు చేశారు. పంట చేతికి వచ్చే సమయం. కాబట్టి పంట కోస్తే వాటిని జాగ్రత్త పరచుకోవాలని తెలిపారు. పంట కోతకు వస్తే ఒక రెండు రోజులు ఆగి కోయాలని సూచించారు. అలాగే మృత్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

Advertisment
తాజా కథనాలు