ధూళిపాళ్ల మూడు దశాబ్దాల ప్రజా ప్రస్థానం సభ సక్సెస్

New Update
DULAPALLY

Dhulipalla Narendra: మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ధూళిపాళ్ల నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా పొన్నూరులో ధూళిపాళ్ల మూడు దశాబ్దాల ప్రజా ప్రస్థానం సభ నిర్వహించారు. ఈ సభలో ధూళిపాళ్ల మాట్లాడుతూ.. రెవిన్యూ శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన తన తండ్రి దూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఓటమి పాలయిన సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు మొదలుకుని, తన తండ్రి అకాల మరణం తరువాత టిక్కెట్టు కోసం చేసిన పోరాటాలు, కక్ష కట్టి పొన్నూరు నియోజకవర్గాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు వైఎస్సార్ చేసిన ప్రయత్నాల వరకూ వివరించి చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను గురించి చెబుతూ.. గత వైసీపీ పాలనలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం గురించి ప్రస్తావించారు. తాను ఆ సమయంలో మానసికంగా కాస్త నలిగిపోయినా.. ధైర్యం కోల్పోలేదని చెప్పారు. 

మాఫియాలకు వ్యతిరేకంగా...

ప్రతిపక్షంలో ఉండగా రేషన్, గ్రావెల్ మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తాను, ఈవేళ అధికారంలోకి వచ్చాక అదే మాఫియాను అనుమతిస్తే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని  పేర్కొన్న నరేంద్ర, తన తండ్రి నుండి వారసత్వంగా అంది పుచ్చుకున్న నైతిక , వ్యక్తిగత విలువలకు కట్టుబడివున్న తనను సన్నిహితులు కొందరు పాతకాలం మనిషిగా గేలిచేసినా, తను మాత్రం జీవితాంతం ఆ విలువలకే కట్టుబడి ఉంటానని  చెప్పటం ద్వారా నరేంద్ర మరోమారు తన నైజాన్ని విస్పష్టంగా ప్రకటించారు. 

అలాగే, తనకు మంత్రి పదవి రాలేదనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని  నరేంద్ర స్పష్టంగా వివరించారు.  మొత్తంగా చూసుకుంటే ధూళిపాళ నరేంద్ర కుమార్ ఈ సభ ద్వారా తన అంతరంగాన్ని అభిమానుల ముందు ఆవిస్కహరించారని చెప్పుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు