Ap: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం..! ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు గుండెపోటుతో కన్నుమూశారు.ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభంలేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. By Bhavana 12 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Ap : ఏపీ ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన మచిలీపట్నంలోని ఆంధ్రా హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు! అక్కడి నుంచి మృతదేహాన్ని ఇంటికి తరలించగా.. పలువురు కూటమి నేతలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. సోదరుడి మరణవార్త విన్న మంత్రి రవీంద్ర విజయవాడలోని కలెక్టర్ల సమావేశం నుంచి హుటాహుటిన మచిలీపట్నం బయల్దేరి వచ్చారు. కొల్లు రమణ వ్యాపారవేత్త. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా? మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరమణ మృతికి సంతాపం తెలిపారు. మంత్రి రవీంద్ర కుటుంబంలో ఇది తీవ్ర విషాదమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. Also Read: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ అలాగే కూటమికి చెందిన నేతలు సంతాపాన్ని తెలియజేశారు. వెంకటర రమణ అంత్యక్రియుల గురువారం నిర్వహించనున్నారు. Also Read: సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి