రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు సభ్యులు

రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఆర్‌.కృష్ణయ్య బీజేపీ నుంచి కాగా బీద మస్తాన్‌ రావు, సానా సతీష్‌ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 

author-image
By Kusuma
New Update
AP Rajyasabha

ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న మూడు స్థానాల నుంచి బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్‌‌లు నామినేషన్లు వేయగా.. ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఈ ముగ్గురితో..

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభలో వీరు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్‌.కృష్ణయ్య బీజేపీ నుంచి, బీద మస్తాన్‌ రావు, సానా సతీష్‌ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ ముగ్గురు చేత ప్రమాణం చేయించారు.

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ఇది కూడా చూడండి: Rachakonda CP: మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు.. సీపీ కీలక ప్రకటన!

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు. అలాగే ఓటమి పాలవ్వడంతో వైసీపీ నేతలు కొందరు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే కాకుండా... రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Advertisment