Potti Sriramulu: పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ

అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.

New Update
potti

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషి, త్యాగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన చేసిన త్యాగానికి గుర్తుగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. డిసెంబర్ 15న (నిన్న) ఆయన వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావంలో సీఎం చంద్రబాబు నివాళులర్పించి తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

తెలుగు ప్రజలు గర్వంచే  ప్రస్తావించే వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఈయన చేసిన త్యాగానికి గుర్తుగా.. రాష్ట్రంలో అతని పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను ప్రతీ ఒక్కరు గుర్తించుకోవాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

త్యాగానికి గుర్తుగా..

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి.. ఆయన స్ఫూర్తిని రాష్ట్రమంతటా వ్యాపింపచేసే బాధ్యత మనదేనని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఒక్కపూట కూడా ఉండలేం. అలాంటిది 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి, అమరజీవి అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
Advertisment
తాజా కథనాలు