/rtv/media/media_files/2024/12/12/QQS2l17Li7QmtLpcUU18.jpg)
Vizag:సినిమాల్లో చూసినవన్నీ నిజ జీవితంలో జరగవని గ్రహించలేకపోయారు ఆ విద్యార్థులు. వారు చూసిన సినిమాలో హీరోలాగా తాము కూడా ఏదోకటి చేసేసి కోట్లు సంపాదించేద్దామనుకున్నారు ఆ నలుగురు విద్యార్థులు. కానీ చేతిలో రూపాయలు అయిపోగానే దిక్కుతోచక రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు గుర్తించి మళ్లీ వారిని సొంతగూళ్లకు చేర్చారు.
Also Read: Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!
అసలు విషయం ఏంటంటే.. విశాఖపట్నంలోని ఆంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు కనిపించకుండాపోయారు. 9వ తరగతి చదువుతున్న జి.రఘు, బి.చరణ్‌తేజ, ఎన్.కిరణ్‌కుమార్, పి.కార్తీక్ అనే నలుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం వసతి గృహం నుంచి గోడ దూకి పారిపోయారు. అయితే విద్యార్థులు.. వారి ఇళ్లకు వెళ్లారేమోనని బోర్డింగ్ హోమ్ నిర్వాహకులు అనుకున్నారు.
Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం
కానీ ఇళ్లకు రాలేదని తల్లిదండ్రులు చెప్పటంతో బోర్డింగ్ హోమ్ ఇన్‌ఛార్జి సోమవారం మహారాణిపేట పోలీసులకు విద్యార్థుల గురించి ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోర్డింగ్ హోమ్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తేంచగా సోమవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు గోడ దూకి బయటకు వెళ్లినట్లు తెలిసింది.
Also Read: BREAKING: మంచు లక్ష్మి సంచలన పోస్ట్!
మరోవైపు విద్యార్థులు నలుగురు ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూసినట్లు తెలిసింది. అందులో హీరో సంపాదించిన విధంగానే తాము కూడా కోట్లు సంపాదించి కార్లు, ఇళ్లు కొనుక్కోవాలని హాస్టల్ నుంచి పారిపోతున్నట్లు తోటి విద్యార్థులకు తెలిపారు. విద్యార్థుల కోసం పోలీసులు రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో గాలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. విద్యార్థుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలంటూ పోస్టర్లు అతికించారు.
Also Read: BIG BREAKING: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్!
విజయవాడలో..
వారి ఫొటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపారు. చివరికి నలుగురు విద్యార్థులు విజయవాడలోని మొగల్రాజపురంలో బ్యాగులతో తిరుగుతుండగా పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖకు పంపించారు. ఇటీవల 'లక్కీ భాస్కర్' సినిమా చూసిన వారు హాస్టల్ నుంచి వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సంగతి తెలిసిందే.
మూవీలో హీరో లాగా ఇళ్లు, కార్లు కొనడానికి డబ్బు సంపాదించిన తర్వాత తిరిగి ఇస్తామని స్నేహితులకు చెప్పి వెళ్లినట్టు సమాచారం. చరణ్, రఘు, కిరణ్ కుమార్, కార్తీక్ అనే విద్యార్థులు అదృశ్యమయ్యారని హాస్టల్ ఇంఛార్జి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు విజయవాడలో గుర్తించారు.