Ap State Disaster Management Authority: అలాంటి నీళ్లే తాగండి.. బయటకు రావొద్దు.. ప్రజలకు ఏపీ సర్కార్ కీలక సూచనలు!

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది.

New Update
Montha Toofan

Montha Toofan

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడిన మొంథా మంగళవారం అర్థరాత్రి సమయంలో తీరం దాటింది. దీంతో ఏపీలో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురవడంతో ఏపీలో కొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వేడి లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: Flash flood : ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక

విద్యుత్ స్తంభాలు టచ్ చేయకుండా..

అధికారిక ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. అలాగే పూర్తిగా దెబ్బతిన్న లేదా పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దని వెల్లడించారు. ఇంట్లో దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను, వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించండని తెలిపారు. ఎందుకంటే వర్షం వల్ల ఏమైనా షాక్ తగిలే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Cyclone Montha: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు