/rtv/media/media_files/2025/11/16/ranga-2025-11-16-11-22-23.jpg)
ఏపీ రాజకీయాల్లో(ap-politics) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్(asha kiran) రాజకీయ ప్రవేశం చేశారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్న వంగవీటి రంగా(Vangaveeti Mohana Ranga) విగ్రహానికి ఆమె ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు.
Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు!
వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయ ప్రవేశం ప్రకటించిన రంగా కుమార్తె ఆశ కిరణ్.రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటా. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తాను.ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను.కులం,మతం బేధం లేకుండా సహాయం చేసిన వ్యక్తి రంగా గారు. pic.twitter.com/9GqxynMKt8
— Phanindra Papasani (@PhanindraP_TNIE) November 16, 2025
ఇకపై నా జీవితాన్ని పూర్తిగా ప్రజలకే అంకితం చేస్తానన్నారు ఆశా కిరణ్. రాధా(vangaveeti-radha) రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు తాను ప్రజల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. కులం, మతం బేధం లేకుండా ప్రజలకు సాయం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని చెప్పారు. గత కొంతకాలంగా నేను పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉన్నాను. కానీ, ఇకపై నా జర్నీ పూర్తిగా ప్రజలతోనే ఉంటుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని ఆశా కిరణ్ తెలిపారు.
Also Read : ఎవరో హైదరాబాద్‌లో ఉండేవాడి కాళ్లకింద బతుకుతున్నాం..వైసీపీ నేత వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ
అంతరాన్ని పూరించడానికి
రాధా రంగా మిత్రా మండలిలో గత కొంతకాలంగా ఉన్న అంతరాన్ని పూరించడానికి తాను వస్తున్నానని ఆశా కిరణ్ ప్రకటించారు. మిత్రా మండలిని తిరిగి ఏకతాటిపైకి తీసుకురావడమే తన తక్షణ లక్ష్యమని స్పష్టం చేశారు. వంగవీటి ఆశా కిరణ్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆమె ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. వంగవీటి కుటుంబానికి విజయవాడ రాజకీయాల్లో తిరుగులేని పట్టు ఉంది.
Follow Us