/rtv/media/media_files/2026/02/01/jogi-ramesh-2026-02-01-17-17-37.jpg)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ ఇంటిని టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకునిరసనగానే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత..!
— RTV (@RTVnewsnetwork) February 1, 2026
మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ శ్రేణులు..
పెట్రోల్ బాంబులతో దాడులు..
తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు@JaiTDP@YSRCParty@naralokesh@ncbn@ysjagan#JogiRamesh#YSRCP#RTVpic.twitter.com/ABvvLJG2wN
మంత్రి లోకేశ్‌కు చిప్ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చేసిన ప్రచారాన్ని సిట్ నిగ్గు తేల్చింది. తెదేపా నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజా కార్యక్రమాలు నిర్వహించా’’ అంటూ జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి అదుపుతప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వ్యక్తులు మాజీ మంత్రి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి.
అదృష్టవశాత్తూ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఈ దాడితో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Follow Us