జగన్‌కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. TDPలో చేరిన కుప్పం కీలక నేత!
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
తిరుపతికి చెందిన లోకేశ్వరి ఎంజాయ్ చేద్దామని స్నేహితురాలితో కలిసి శిల్పారామానికి వెళ్లింది. సరదాగా క్రాస్ వీల్ ఎక్కగా అది ఒక్కసారిగా ఊడిపడింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో లోకేశ్వరి మృతి చెందగా.. తన స్నేహితురాలు తీవ్ర గాయాలతో బయటపడింది.
రాబోయే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి 2027 చివరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు.
తిరుమలలో పని చేసే వారు కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండనప్పుడు.. వక్ఫ్ బోర్డులలో మాత్రం ఎందుకంటూ ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో దారుణం జరిగింది. సుశాంత్ అనే యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ జూపి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన లడ్డూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ఇండియా టుడే దీనిపై శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి విచారణ జరిపింది. కాగా రిపోర్టులో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది.
శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనాలకు భారీగా సమయం పడుతోందని.. అయితే గంటలోగా స్వామివారి దర్శనాలు కల్పించాలి అనే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.