యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు. By Kusuma 11 Nov 2024 in క్రైం విజయనగరం New Update షేర్ చేయండి ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. యూట్యూబ్‌లో చూసి డెలివరీలు అన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి యూట్యూబ్‌లో దొంగ నోట్లు తయారు చేయడం ఎలాగో చూసి ట్రై చేశారు. చివరికి పుత్తూరు పోలీసులు దొంగ నోట్లు తయారు చేస్తున్న ముఠాను గుట్టు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని చెర్లోపల్లిలో రమేష్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి తులిప్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! యూట్యూబ్ చేసి నేర్చుకుని.. ఇంటి దగ్గరే తన భార్య సంధ్య, కూతురు నిషా, స్నేహితుడు మునికృష్ణారావుతో కలిసి దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. దొంగ నోట్లు తయారు చేయడం ఎలాగో యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. దీనికి కావాలసిన వస్తువులను కూడా సెట్ చేసుకున్నారు. ఇంట్లోనే దొంగ నోట్లు తయారు చేసుకునే విధంగా అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి వీరందరూ కూడా దాదాపుగా మూడు నెలల పాటు దొంగ నోట్లు తయారీ చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేశారు. ఇలా చేసి గత మూడు నెలల నుంచి సుమారుగా రూ.500 నోట్లను ఒక పది లక్షల వరకు తయారు చేశారు. తిరుపతి, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరులో వాడారు. ఇలా ఎక్కువగా ఆ దొంగ నోట్లు వాడుతుండగా పోలీసులు చివరికి పుత్తూరులో పట్టుకున్నారు. ఇది కూడా చూడండి: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! 192 వంద రూపాయల నోట్లు, 156 రూ.500 నోట్లు పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు నోట్లు తయారీకి అవసరమైన పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఈ నలుగురుపైన కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి