Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి.

New Update
ap rains

AP Rains: ఏపీ వాసులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ. నేటి నుంచి ఏపీలో కొన్ని చోట్ల భారీ వానలు కురవనున్నట్లు అధికారులు వివరించారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Also Read:  Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా

 వచ్చే మూడు రోజులు...

ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పారు.

Also Read:  Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు

మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి,కర్నూలు,  జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Also Read: అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు!

ఇక బుధవారం కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని తెలిపింది. ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, జిల్లాలలో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Also Read:  అదే మా లక్ష్యం.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై చంద్రబాబు కీలక ప్రకటన

గురువారం కూడా కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ, శుక్రవారం నాటికి వానలు తగ్గే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు వాతావరణం వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు