AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 11 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Rains: ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 12 నుంచి 14 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. Also Read: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు... ఆ తరువాత పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నవంబర్ 12 నుంచి 14 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని అధికారులు వివరించారు. Also Read: కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర ఆవర్తనం కారణంగా సోమవారం , నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నవంబర్ 12న అంటే మంగళవారం నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, కాకినాడ, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. Also Read: Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!? నవంబర్ 13న బుధవారం.. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. Also Read: రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. నవంబర్ 14 గురు వారం రోజున గోదావరి జిల్లాలు, తిరుపతి గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి