చంద్రబాబు సంచలనం.. 20 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!

AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా త్వరలో మరికొంత మంది ఐపీఎస్, డీఎస్పీ స్థాయి బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

DSP Transfers: డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి  భద్రతల గురించి అరా తీశారు. సోషల్  మీడియాలో వైసీపీ మద్దతుదారులు చేసే పోస్టుల పై తీసుకుంటున్న చర్యలపై ..హైకోర్టు వ్యాఖ్యలపై డీజీపీ సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం. పోలీసు శాఖ ప్రక్షాళనపై సీఎంకు డీజీపీ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా రాష్ట్రంలో 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా కొందరు ఐపిఎస్, డిఎస్పీ  స్థాయి అధికారులు పై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో  రాష్ట్రంలో భద్రతా చర్యలు పై చర్చ పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

20 DSPs transferred in AP.pdf

బదిలీలు అయిన డీఎస్పీలు..

* జి. సీతారామా రావు, 
* వీవీ అప్పా రావు, 
* ఎన్. కాళిదాస్, 
* చిట్టిబాబు, 
* బి.రామకృష్ణ, 
* సురేశ్ కుమార్ రెడ్డి, 
* ఏబీజీ తిలక్, 
* రవి కిరణ్, 
* మల్లిఖార్జున రావు, 
* శ్రీనివాస రెడ్డి, 
* ఎండీ.మొయిన్, 
* కే సీహెచ్ రామా రావు, 
* విజయశేఖర్, 
* కొంపల్లి వెంకటేశ్వర రావు, 
* కే. రసూల్ సాహెబ్, 
* సీహెచ్ వి రామా రావు, 
* షన్ను షేక్, 
* ఎన్. సురేశ్ బాబు, 
* వాసుదేవన్, 
* డి.లక్ష్మణరావు 

Advertisment
తాజా కథనాలు