TTD: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. తిరుమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. తిరుమలలో గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించింది. వర్షం పడే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసింది. By Kusuma 14 Nov 2024 in లైఫ్ స్టైల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది మొత్తం భక్తులు వెళ్తూనే ఉంటారు. ఏ సమయంలో అయిన కూడా ఆలయం రద్దీగానే ఉంటుంది. కొండ దిగువన, పైన పలు కౌంటర్లలో దర్శన టికెట్లు ఇస్తుంటారు. అయిన కూడా ఎప్పటికప్పుడూ టికెట్లు అయిపోతుంటాయి. భక్తులకు ఈజీగా ఉండేందుకు టీటీడీ కూడా ఎన్నో మార్పులు చేస్తుంటుంది. ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? వర్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ క్రమంలో నూతన కౌంటర్‌ను టీటీడీ ప్రారంభించింది. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను గోకులం సమావేశ మందిరం వెనుక వైపు ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా రోజుకి 900 టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. వర్షం పడినప్పుడు భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే గతంలో టికెట్ కేటాయించడానికి కనీసం నాలుగు నిమిషాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క నిమిషంలోనే భక్తులకు టికెట్ కేటాయించేలా చేస్తున్నారు. మొత్తం ఐదు కౌంటర్ల నుంచి భక్తులు ఈజీగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా! ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు అంగప్రదక్షిణం సేవా టిక్కెట్ల ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌లు అందుబాటులో ఉంటాయని కూడా టీటీడీ తెలిపింది. అంగప్రదక్షిణానికి ఆసక్తి ఉన్న భక్తులు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఒక్క నిమిషం దాటిన కూడా రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని టీటీడీ తెలిపింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం తిరుపతి అర్బన్, రూరల్, స్థానికుల కోసమేనని టీటీడీ తెలిపింది. ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం #ttd-updates #ticket counter #tirumala devotees #tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి