Ganja: ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం.. మహిళ ఆద్వర్యంలోనే మత్తు దందా! ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖకకు చెందిన బేబీ అనే మహిళ తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. By srinivas 10 Nov 2024 | నవీకరించబడింది పై 10 Nov 2024 16:52 IST in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Ganja: ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. చంద్రగిరిలో ఓ మహిళా అక్రమంగా అమ్ముతున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.కొంగరవారిపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో వెంటనే తనీఖీలు మొదలుపెట్టిన పోలీసుల.. 22 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇది కూడా చదవండి: TSPSC Group 3 Hall Tickets: గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల రెవిన్యూ అధికారుల సహకారంతో.. ఈ మేరకు చంద్రగిరి సీఐ, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బేబీ అనే మహిళ వైజాగ్ సమీపంలో యానాదుల నుంచి సేకరించి తిరుపతిలో అమ్మకాలు జరిపేది. తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ అమ్మకాలను చేస్తున్నారు. బేబీ వైజాగ్ నుంచి 22 కేజీల గంజాయిని అమ్మేందుకు తీసుకురాగా, తిరుచానూరుకు చెందిన నరసింహ, కార్తీక్, ప్రవీణ్, మణికంఠ, ఉత్తరప్రదేశ్ కు చెందిన అబ్దుల్ కయాం జుబేర్ లు గంజాయిని కొనుగోలు చేసేందుకు చంద్రగిరి మండలం ఎం.కొంగువారి పల్లి దగ్గరకు వచ్చారు. అదే సమయంలో పోలీసులు రెవిన్యూ అధికారుల సహకారంతో దాడులు నిర్వహించి ఆరు మందిని అరెస్టు చేశారు. రమ్య అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి 22 కేజీల గంజాయి, ఒక బైకు, 2,100 నగదు, ఆరు సెల్ పోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 5.52 లక్షలు రూపాయలు ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం ! #tirupati #vishaka #ganja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి