TTD: అధికారుల నిర్ణయానికి నో చెప్పిన టీటీడీ  ఛైర్మన్

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు అందుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
ttd

TTD: టీటీడీ పాలకమండలిగా ఛైర్మన్‌ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అయితే బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గతంలో  ఉన్న ఛైర్మన్లకు భిన్నంగా వ్యవహరించారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్‌ నాయుడు టీటీడీ అందించే వాహనాలు, వసతి సదుపాయాలను సున్నితంగా తిరస్కరంచారు.

Also Read:  నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మొదటి రోజే పూర్తిస్థాయి బడ్జెట్

అలాగే ప్రమాణ స్వీకారం కోసం తిరుమలకు వచ్చిన ఆయన.. ఇక్కడ ఉన్నన్ని రోజులూ సొంత వాహనాలను వినియోగించడంతో పాటు సహచరులు, బంధువులు ఉన్న వసతి గదుల అద్దెలు, భోజనం ఖర్చులను ఆయనే భరించారు. బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది. .

మరోవైపు టీటీడీ నూతన పాలకమండలి మొదటి సమావేశం ఈ నెల 18న జరగనుందని తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఎజెండా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. 

Also Read: UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..!

తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలను ప్రకటించనున్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. గత బోర్డు నిర్ణయాలపైనా చర్చించే అవకాశం కనపడుతుంది.

Also Read: యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అన్నారు బీఆర్ నాయుడు. ప్రమాణస్వీకారం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. 

Also Read: 'పుష్ప 2' విషయంలో దేవీకి దెబ్బేసిన సుకుమార్.. ఇక కెరీర్ కష్టమేనా..!

తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు