AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా!
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
నెల్లూరు జిల్లా బాపట్లలో 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. మేనమామ ఇంటికి వచ్చిన బాలికపై పొరుగింటి వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AP: కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకాణిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరైన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.