AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్‌..జాగ్రత్త అంటున్న అధికారులు!

ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
hyd

AP Rains : ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. ఈ సారి వాయుగుండం రూపంలో ముప్పు ముంచుకు వస్తోంది.వరి కోత దశలో ఉండడంతో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తుంది.

Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!

దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై అధికంగా ఉంటుందని తెలుస్తుంది. ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండం ముప్పునకు రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి.

Also Read:  TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు!

భారీ నష్టమే...

చాలా వరకు వరి ఎక్కడికక్కడ పొలాల్లో ఉంది. ఈ దశలో భారీ వర్షాలు నమోదైతే భారీ నష్టమే జరుగుతుంది. బలమైన గాలులు వీచే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక వరి పంటలు నెలకొరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది. 

Also Read: Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ!

మరో వైపు, ఏపీ దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తేలికపాటి నుంచి మొదలయ్యే వర్షాలు క్రమేపీ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Also Read: DHL Cargo Plane: జనావాసాలపై కుప్పకూలిన బోయింగ్‌ విమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు