హైదరాబాద్ లో పార్టీ చేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. ఫొటోలు వైరల్! వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 15 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్ తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరంతా గత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి గత శాసనసభలోకి అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2018లో గెలుపొందారు. ఈ సారి మాత్రం టీటీపీ అభ్యర్థి ఫరూక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ఒక రోజు ముందు తన మిత్రుడు అల్లు అర్జున్ ను ఇంటికి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. శిల్పా రవి తండ్రి శిల్పా మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా పని చేశారు. ఆయన వారసుడిగా రవి రాజకీయాల్లోకి వచ్చారు. గత వైసీపీ సర్కార్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో.. ఆయన సోదరుడైన విక్రమ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. విక్రమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజోగోపాల్ రెడ్డి గతంలో అనేక సార్లు ఎంపీగా కూడా పని చేశారు. అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డ అబ్బయ్య చౌదరి 2019 ఎన్నికల సమయంలో దెందులూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ ను ఓడించి రికార్డు సృష్టించారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో స్నేహం.. హఫీజ్ ఖాన్ విషయానికి వస్తే 2018 ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పార్టీలో వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను అక్కడ ఈ సారి వైసీపీ తమ అభ్యర్థిగా బరిలోకి దించింది. అయితే.. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈ నలుగురు ఎమ్మెల్యేల మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వీరు సరదాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఆత్మీయంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి