నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి! నెల్లూరు నగర పాలక సంస్థలో తీసుకునే నిర్ణయాలు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పెద్ద చిచ్చునే పెడుతున్నాయి. చాలా విషయాల్లో మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. By Bhavana 27 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి నెల్లూరు నగర పాలక సంస్థలో తీసుకునే నిర్ణయాలు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పెద్ద చిచ్చునే పెడుతున్నాయి. చాలా విషయాల్లో మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేషన్ లో మంత్రి పెత్తనం, ఆధిపత్యం పెరగడంతో పాటు ఎమ్మెల్యే ప్రాబల్యం బాగా తగ్గుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి కావడంతో కార్పొరేషన్ లో ఆయన పెత్తనం, ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో ఒక్కసారిగా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అనే తీరుగా మారింది. నీ నియోజకవర్గంలో ఏమైనా చేసుకో..నా నియోజక వర్గంలో మంత్రి పెత్తం ఏంటి అంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి మున్సిపల్ యాక్ట్ రాష్ట్రానికి మొత్తం ఉందా..అంటూ కోటంరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇది నారాయణ యాక్ట్ అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి విమర్శిస్తున్నారు.అటు మంత్రి..ఇటు ఎమ్మెల్యే వరుస మీటింగ్ లతో నలిగిపోతున్న అధికారులు.నెల్లూరు నగర పాలక సంస్థ లో డివిజన్ లు మొత్తం 54 ఉండగా..నెల్లూరు సిటీ పరిధిలో ఉన్నవి 28. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో..26 ఉన్నాయి.నేను మున్సిపల్ శాఖ మంత్రిని... నెల్లూరు నగర పాలక సంస్థ లో ఏం జరగాలన్న తన కనుసన్నల్లో నే...జరగాలి అనే పంథాలో మంత్రి నారాయణ వెళ్తున్నారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరు కూడా పోటా పోటీగా నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇద్దరి మధ్యన ఇబ్బంది పెడుతున్న అధికారులు, సిబ్బంది. ఇంటి పన్నులు చెల్లించని వారి ఇళ్లకు కరెంట్ కట్ చేసి పన్నులు వసూలు చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 81 ఇళ్ళకు కరెంట్ కట్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు. రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది పెట్టి పన్నులు వసూళ్ళు చేయ వద్దని కోటంరెడ్డి అంటున్నారు.పన్నులు వసూలు చేయాలి... కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దని ఆయన అంటున్నారు. పన్నులు చెల్లించడానికి వాయిదాల పద్ధతిలో వసూలు చేయండి.అని కోటంరెడ్డి అంటున్నారు. రౌడీయిజంగా వసూలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వాని పై వ్యతిరేకత వస్తోంది...నా డివిజన్ లలో పేద, నిరుపేద,మద్యం తరగతి ప్రజలు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నా నియోజకవర్గంలోని వారు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని కోటంరెడ్డి అన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి