ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

New Update
ap rains

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా అధికారులు జారీ చేశారు. వచ్చే 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర వాయు గుండం రేపు ఉదయానికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్..

ఈ రెండు జిల్లాలతో పాటు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. రేపు ఉదయం ఈ ఫెంగల్ తుపాను తీరం దాటడంతో వచ్చే మూడు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు, శ్రీలకంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అధికారులు మళ్లీ ఆదేశాలు జారే చేసే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

ఏపీలో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కోనసీమ, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, బాపట్ల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు