/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
Nellore: హిజ్రా నాయకురాలి హత్యతో నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన హిజ్రా నాయకురాలు హసినిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి దుండగులుహత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు హిజ్రాల నాయకురాలు కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
Also Read: Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!
కారులో వచ్చి..
నెల్లూరులోని దీనదయాళ్‌నగర్‌కు చెందిన హాసిని కొన్ని రోజులుగా తిరుపతి శివారు మంగళం ప్రాంతంలో నివసిస్తోంది. ఈమెకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన వర్గముంది. విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో మహాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టి కొంతమేరకు పనులు చేయించింది. ఈ క్రమంలో మంగళవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
Also Read: Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!
ఆమెతోపాటు సహచర హిజ్రాలు పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హాసిని కారులో నెల్లూరుకు బయలుదేరింది. టపాతోపు రైల్వే గేటు అండర్ బ్రిడ్జి వద్ద ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమె కారును అడ్డగించారు. ఆమెను బలవంతంగా బయటకు లాగి మెడ, వీపు భాగంలో కత్తులతో నరికి చంపారు. అదే సమయంలో వెనుక ఆటోలో వస్తున్న హిజ్రాలను చూసి దుండగులు ఘటనా స్థలంనుంచి పారిపోయారు.
Also Read: AP : శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు
అప్పటికే తీవ్రంగా గాయపడిన హాసినిని అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read: PAN CARD: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?
హిజ్రాల నాయకురాలు హాసిని హత్యకు గురైన విషయం తెలుసుకున్న నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు బుధవారం నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావును కలిసి తమ నాయకురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం జీజీహెచ్ మార్చురీలో హాసిని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తీసుకుని వెళ్లారు.