Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు! రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. By Bhavana 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Andhra Pradesh: రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పని వేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కాగా దీన్ని 5 గంటల వరకు పెంచింది. మండలానికి రెండు పాఠశాలల్లో.. ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో ఈ విధానం అమలుకు ఆదేశాలిచ్చింది. ఎంపిక చేసిన స్కూళ్లలో నవంబర్ 25 నుంచి 30 వరకు ఈ విధానంలో పాఠశాలలు నడపనున్నారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు ప్రకటించారు. Also Read: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్ ఈ ప్రయోగం అనంతరం ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక్కడి ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయనున్నారు. Also Read: Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష ఉన్నత పాఠశాలల పని వేళల మార్పు నిర్ణయం పై పునరాలోచించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ , సీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు జమాల్ రెడ్డి, ఏసీవీ గురువా రెడ్డిలు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. Also Read: డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 5 కి.మీ పరిధి దూరం నుంచి వచ్చే విద్యార్థులుయ కొందరు ఉంటారు. వారంతా సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఆ తరువాత ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అంటున్నారు. వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. Also Read: Delhi: ఢిల్లీలో స్టేజ్ –4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్ #academic calendar #government schools #ap-news #students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి