AP Crime: ఏపీలో పండగ పూట పెను విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో వాలీబాల్ ఆడుకునేందుకు పోల్లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.