దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు.
దేవాలయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు నగరంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఎమ్మెల్యే టిజి భరత్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో రెండు రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో.. తీవ్ర ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఆ తరువాత వాతావరణం మారిపోయి మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో నల్లవాగును శిల్పా గ్రూప్ కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తించారు. దీంతో మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల దగ్గర అశోక్ అనే వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమన్నారు. ఈ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుందని బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ చూపించి భయపెడితే ఎవరు భయపడరని అన్నారు. తాను 2004 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తిరిగి ఆ సంస్కృతిని తీసుకొచ్చేలా చేయొద్దని కోరారు. వీలైతే ప్రజలకు మంచి చేయాలన్నారు.