AP crime: ఏపీలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. సరదాగా స్నేహితులతో కలిసి బయటికి వెళ్లిన విద్యార్థి తిరిగి రాకుండా శవమై కనిపించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. స్థానిక వివరాల ప్రమాదం.. కర్నూలు జిల్లాలో కేవీ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఉదయం ఆరుగురు స్నేహితులతో కలిసి హాస్టల్ నుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఏం జరిగింది ఏమో తెలియదు కానీ బావిలో రాంప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు.
బావిలో పడి మృతి:
ఒకరోజు గడిచినా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. యాజమాన్య తీరుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాంప్రసాద్ మృతిపై కాలేజీ యాజమాన్యం చెప్పకపోగా.. ఐదు లక్షలు ఇస్తాము కాలేజీ ముందు ఆందోళన చెయొద్దని తల్లిదండ్రులతో డీల్ మాట్లాడుతున్నారు.
ఇది కూడా చదవండి: నిద్రపోయే ముందు ఇలా చేయండి..చర్మం మంచులా మెరిసిపోతుంది
బిడ్డ మృతి చెందడంతో కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ దగ్గర చేసుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న వారికి సర్థి చెప్పారు. తమ బిడ్డని కావాలనే చంపేశానంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బరువును బట్టి రోజూ ఎంత ప్రొటీన్ తీసుకోవాలి?