1000 కార్లతో ఆళ్లగడ్డకు మౌనిక, మనోజ్.. పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన?

భూమా అఖిల ప్రియ. మంచు మనోజ్ దంపతులు రేపు వేయి కార్లతో నంద్యాలకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమా శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

New Update


ఇటీవల వార్తల్లో నిలిచిన మంచు మనోజ్, భూమా మౌనిక రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్లనున్నారు. వేయి కార్లతో భారీ ర్యాలీగా ఆళ్లగడ్డకు వెళ్లేందుకు వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మౌనిక తల్లి.. శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల్లో రేపు వీళ్లు పాల్గొననున్నారు. భూమా ఘాట్‌లోని శోభ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు. భూమా మౌనిక సోదరి అఖిల ప్రియ ఇప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. అక్కతో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొంటారా? లేదా విడిగా పాల్గొంటారా అన్న అంశంపై చర్చ సాగుతోంది.

ఉమ్మడి జిల్లా నుంచి భారీగా నేతలు..

ఈ జయంతి ఉత్సవాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచి భారీగా నేతలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే భూమా ఫ్యామిలీలోనూ వర్గ పోరు మొదలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో దాడులు జరిగాయన్న వార్తలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదంపై మౌనిక సోదరి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంత వరకు స్పందించలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు