Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే

టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు. 

New Update
11

కర్నూలు జిల్లాలో రైతులకు టమోటా చుక్కలు చూపిస్తోంది. బయట మార్కెట్‌లో కిలో 20, 30 రూ.  పలుకుతున్న టమోటా ధర పత్తికొండ మార్కుఎట్‌లో మాత్రం కిలో ఒక్క రూపాయికి పడిపోయింది. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా టమోటా ధర ఒక్కసారిగా హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. అందుకే టమోటా ధర తగ్గిందంటున్నారు వ్యాపారులు. నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ.30 వరకు పలికింది..కానీ ఉన్నట్టుండి రూపాయికి పతనం కావడంతో.. ఎంతో కష్టపడి టమోటా పండించి.. మార్కెట్‌కి చేర్చితే.. కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదని టమోటాను మార్కెట్‌కి తరలించే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. 

Also read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్‌ 19 మహమ్మారి..39 మంది మృతి

Also Read: జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

Tomato Price In AP

కొన్ని రోజుల క్రితం జత బాక్స్ 1500 నుచి 2000 పలికిన టమోటా ధర ప్రస్తుతం 50 నుంచి 100 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటాలు తెంఇన కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా రావడం లేదని అంటున్నారు. మరో వారం రోజుల్లో మోటా ర లేకపోతే మార్కెట్ మూతపడాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. 

Also Read: కేటీఆర్‌కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్!

Also Read: సిరియాలో అసద్ పాలన అంతం వెనుక 14 ఏళ్ల బాలుడి హస్తం..

Advertisment
తాజా కథనాలు