Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య సమాచారం. శ్రీశైలంలో కొత్త సంవత్సరం మొదటి రోజున స్పర్శ దర్శనం రద్దు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చే అవకాశాలున్నాయి.తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా జనవరి ఒకటో తేదీ శ్రీశైలానికి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. Also Read: ISRO: 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. జనవరి ఒకటో తేదీ శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలను సైతం ఆపేశారు. Also Read: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. జనవరి ఒకటో తేదీ అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. అలాగే సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భక్తులందరికీ త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఈవో చెప్పారు. Also Read: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు.. క్యూకాంప్లెక్సులో భక్తులకు మంచినీరు, అల్పాహారం అందజేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు చెప్పారు. భక్తులకు ఉదయం పదిన్నర నుంచే అన్నప్రసాద భవనంలో ప్రసాదం పంపిణీ చేస్తామని అన్నారు. ఉదయం దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి లడ్డూ కౌంటర్లలో భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. Also Read: AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! మరోవైపు శ్రీశైలంలో భక్తుల రద్దీతో సంబంధం లేకుండా స్పర్శ దర్శన సదుపాయం కల్పిస్తామని ఈవో శ్రీనివాసరావు ఇటీవల వెల్లడించారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి రోజుల్లో స్పర్శ దర్శనం, అభిషేకాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేస్తుంటుంది. అయితే ఇకపై రద్దీ రోజుల్లో కూడా భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తామని శ్రీనివాసరావు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పారు.