యూట్యూబ్ చేసి సొంత మేనత్త ఇంట్లోనే ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. పొలం గొడవలు ఉండటంతో ఆర్థికంగా మేనత్తను దెబ్బ తీసేందుకు ఆమె ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఎవరికి దొరకకుండా ఎలా దొంగతనం చేయాలో అని యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నంగనూరుపల్లెకు చెందిన మునెయ్య ఆర్టీసీలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో పగ పెంచుకుని..
ఇతని భార్య అన్న కొడుకు వ్యక్తిగత కారణాల వల్ల కొంత అప్పు చేశాడు. వాటిని తీర్చలేక పొలం అమ్మాలని ప్రయత్నించాడు. ఈ పొలం విషయంలోనే వీరి కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేనత్త గంగమ్మ కారణం వల్లే ఇలా చేశాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.
ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!
ఇంట్లో కారం చల్లితే పోలీసులు పట్టుకోలేరని భావించాడు. ఓ రోజు మేనత్త తన కుమారుల దగ్గరకు బెంగళూరు వెళ్లారు. ఇదే సమయంలో మేనల్లుడు ఇంట్లో చోరీకి పాల్పడి రూ.4.60 లక్షల విలువైన 15.5 తులాల బంగారు ఆభరణాలు, పాస్ పుస్తకాలు అన్ని దొంగతనం చేసి కారం పొడి చల్లి వెళ్లిపోయాడు. బెంగళూరు నుంచి వచ్చిన మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయట పడింది.
ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
యూట్యూబ్ చూసి తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని దగ్గర ఉన్న ఆభరణాలను తీసుకుని మేనత్తకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్