గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన మంచు మనోజ్, భూమ మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరడానికి వీరు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. నేడు ఆళ్లగడ్డలో మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. అనంతరం భూమా ఘాట్ నుంచే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ తో వీరికి తీవ్ర విభేదాలు ఇటీవల తలెత్తాయి. పరస్పర దాడులు చేసుకునే వరకు వీరి వివాదం వెళ్లింది. దీంతో రాజకీయంగా బలపడాలని వీరు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలను ఇందుకు ముహూర్తంగా భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Also Read : వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్ Also Read : నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం నంద్యాల నుంచే ఎందుకంటే? భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె తల్లి శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే.. తల్లి మరణం తర్వాత మౌనిక సోదరి అఖిల ప్రియ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. నంద్యాలలో నాగిరెడ్డి మరణం తర్వాత.. ఆయన అన్నకొడుకు బ్రహ్మానందరెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. Also Read : భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు ఉప ఎన్నికల్లో గెలుపొందిన బ్రహ్మానందరెడ్డి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఫారూఖ్ హుస్సేన్ టీడీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. నంద్యాల కూడా తమ చేతుల్లోనే ఉండాలని భూమా ఫ్యామిలీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మౌనికను వ్యూహాత్మకంగా జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమి తరఫున ఆమెను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేలా స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Also Read : పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!