తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నామన్నారు. సీఎం ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాంటి విధానాలు పాటించాలో.. ఇప్పుడు సైతం అదే విధానాలు తీసుకురావాలని కోరారు. తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తుందన్నారు. గతంలో టీటీడీ ఇక్కడ కల్యాణ మండపాలు నిర్మించేదని కొండా సురేఖ గుర్తు చేశారు. ఇంకా ఆలయాలను అభివృద్ధి చేసేదన్నారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి:Annamalai: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్
శ్రీశైలం: తెలంగాణ మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్..
తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి
తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా
టిటిడి తరుపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులను కేటాయించాలి
కొండా సురేఖ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు టీటీడీ తీరుపై వరుసగా అసంతృప్తి చేస్తున్నారు. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే టీటీడీ అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణ నేతలు, ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తులపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి:Nara Lokesh: నారా లోకేష్ మామూలోడు కాదు.. ఒక్క ట్వీట్‌తో ఏం చేశాడంటే!
తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు.
Konda Surekha TTD
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నామన్నారు. సీఎం ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాంటి విధానాలు పాటించాలో.. ఇప్పుడు సైతం అదే విధానాలు తీసుకురావాలని కోరారు. తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తుందన్నారు. గతంలో టీటీడీ ఇక్కడ కల్యాణ మండపాలు నిర్మించేదని కొండా సురేఖ గుర్తు చేశారు. ఇంకా ఆలయాలను అభివృద్ధి చేసేదన్నారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Annamalai: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్
మరో సారి హాట్ టాపిక్ గా సురేఖ మాటలు..
కొండా సురేఖ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు టీటీడీ తీరుపై వరుసగా అసంతృప్తి చేస్తున్నారు. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే టీటీడీ అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణ నేతలు, ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తులపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: నారా లోకేష్ మామూలోడు కాదు.. ఒక్క ట్వీట్‌తో ఏం చేశాడంటే!