Bihar News: బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా నవ్‌టోల్‌లో నాగ పంచమి వేళ ఓ వింత సంఘటన జరిగింది. ఈ గ్రామంలో నాగ పంచమి రోజు వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసే సంప్రదాయం ఉంది. చిన్నాపెద్ద ఆ పాములతో ఎంతో స్నేహంగా మమేకమవుతారు.

New Update
Bihar News

Bihar News

భారతదేశంలో నాగ పంచమి రోజున పాములను పూజించడం సాంప్రదాయంగా సాగుతోంది. పాములకు పాలు పోసి, పూజలు చేస్తూ క్షేమకాంక్షలు కోరే ఆచారం వేలాది ఏళ్లుగా ఉంది. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది భిన్నమైన రూపంలో జరగడం ప్రత్యేకత. బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలోని మన్సూర్చక్ బ్లాక్‌లో ఉన్న నవ్‌టోల్ గ్రామంలో నాగ పంచమి వేళ జరిగే ఒక వింత సంఘటనకు ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఈ గ్రామంలో నాగ పంచమి రోజు వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసే సంప్రదాయం ఉంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వినూత్న ఆచారం ప్రజల్లో భయాన్ని కలిగించడమే కాకుండా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. 

Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!

పాములకు- మనుషుల మధ్య సహజ సంబంధం..

ఇక్కడి గ్రామస్తులు పాములను బంధించరు.. కేవలం నది నుంచి తీసి బయట పెట్టి ఆ పాములతో ఎంతో స్నేహంగా మమేకమవుతారు. పిల్లలు కూడా పాములతో ఆడుకుంటారు. ఇది చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవడం సహజం. ఈ సంప్రదాయం సుమారు 300 ఏళ్ల క్రితం మొదలైంది. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం.. అప్పట్లో గ్రామంలో ఉన్న ఒక తాపసి అనుగ్రహంతో పాములకు మరియు మనుషులకు మధ్య ఒక సహజ సంబంధం ఏర్పడిందట. అప్పటి నుంచి నాగ పంచమి రోజు పాములను నది నుంచి బయటకు తీసి.. వాటిని పిల్లల్లా సంరక్షించడం సంప్రదాయంగా మారింది. పాములు పిలిస్తే వచ్చి చేతులమీద ఎక్కడం, చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఈ ప్రాంతంలో ఒక సాధారణ దృశ్యంలా మారిపోయింది. 


ఇది కూడా చూడండి:Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

ఈ ప్రత్యేక సందర్భాన్ని చూడటానికి ఇప్పటికీ దూరప్రాంతాల నుంచి ప్రజలు నవ్‌టోల్ గ్రామానికి తరలివస్తుంటారు. పాములు ఎలాంటి హానీ చేయవు, కాటు వేయవు అన్న విశ్వాసం ఇక్కడ ప్రజలలో పుష్కలంగా ఉంది. పాములను పూజించడం మాత్రమే కాకుండా వాటితో స్నేహంగా మెలగడం ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును కల్పించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాములను దూరంగా ఉంచాలని జాగ్రత్త పడతారు కానీ నవ్‌టోల్ గ్రామంలో మాత్రం పాములను ఇంటి సభ్యుల్లా గౌరవిస్తారు. భయానకంగా కనిపించే విషపు పాములతో ఇలా ఆడుకోవడం దేశంలో మరే చోటా కనిపించదు. ఇది ఒక అద్భుతమైన, విశిష్టమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..

ఇది కూడా చదవండి: 
చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి

(bihar-news | Latest News)

Advertisment
Advertisment
తాజా కథనాలు