/rtv/media/media_files/2025/07/17/gangrape-2025-07-17-12-43-25.jpg)
రాజస్థాన్‌లో మానవత్వాన్ని సిగ్గుపడేలా దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 11 రోజుల పాటు ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాకు చెందిన బాధితురాలు ఏప్రిల్ 24న ఇంటినుంచి బయటికొచ్చింది. బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. కారులోనే తిప్పుతూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాక మరో నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 11 రోజులు బంధీగా ఉంచి పదే పదే మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడేసి పరారయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు 2025 జూన్ 2న బాగద్ తిరాయ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
రూ. 3 లక్షలు ఆఫర్
నిందితులు దీనంతా రికార్డ్ చేశారని, ఈ విషయం చెబితే వాటిని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించింది. విషయం బయటకు పొక్కకుండా చేయడానికి వారు రూ. 3 లక్షలు ఆఫర్ చేశారని.. నేను వారి ఆఫర్‌ను అంగీకరించకపోతే నన్ను చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్టు చేయకపోవడంతో బాధితురాలు తన కుటుంబంతో కలిసి డిఎస్పీ కార్యాలయానికి చేరుకుని న్యాయం కోసం వేడుకుంది. కేసు దర్యాప్తును రామ్‌గఢ్ డీఎస్పీ సునీల్ కుమార్ శర్మకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ తేజ్‌పాల్ సింగ్ తెలిపారు. బాధితురాలి వైద్య పరీక్ష, వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేయనున్నారు. నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు, కానీ త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Also Read : BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?