Free Bus: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.

New Update
AP Free Bus Scheme

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీబస్ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ రోజు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. 

Also Read :  మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. విద్యార్థిని కిడ్నాప్ చేసి.. మూత్రం తాగించి ( సెల్ఫీ వీడియో వైరల్)

Also Read  :  వర్షిణి కావాలి..  జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!

ఈ కమిటీ  ఇప్పటికే ఫ్రీబస్ స్కీమ్ అమలు అవుతున్న తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించింది. అందుకు సంబంధించిన రిపోర్ట్ ప్రభుత్వం వద్దకు చేరింది. దీంతో ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే.. తెలంగాణలో మాదిరిగానే ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటారా? లేక రేషన్ కార్డును తీసుకుంటారా? అన్న అంశంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read :  అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమం కూడా అమలు చేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తుందన్నారు. రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఓర్వకల్‌కు రైల్వే ట్రాక్‌ తీసుకొస్తామని చెప్పారు.

పచ్చదనం పెంపొందించండి..

పచ్చదనం పెంపొందించడానికి ప్రజలంతా కృషి చేయాలని చంద్రబాబు కోరారు. ఉద్యోగులంతా ప్రతీ నెలలో మూడో శనివారం నాడు శుభ్రతపై ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా మూడో శనివారం నాడు పరిసరాలు, ఇళ్ల శుభ్రతలో పాలు పంచుకోవాలన్నారు. 

Also Read :  RBI సంచలన ప్రకటన..మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?

(ap free bus to women | free-bus not present | chandrababu | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు