AP: రాయలసీమ, కోస్తాంధ్రాలకు భారీ వర్షాలు..
మరో రెండు రోజుల్లో రాయలసీమ, కోసతాంధ్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో వర్షాలు విపరీతంగా పడతాయని హెచ్చరిస్తోంది. ముందస్తుగానే ఏర్పాట్లను చేసుకోవాలని సూచించింది.