Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్‌ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను ఆయన అభినందించారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.

New Update
Chandrababu congratulates Harihara Veera Mallu.

Chandrababu congratulates Harihara Veera Mallu

 Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్‌ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను ఆయన అభినందించారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.

కాగా, అంతకు ముందు చంద్రబాబు హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు."మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జులై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23 వ తేదీ రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read: H-1B Visa: హెచ్ 1 బీ వీసాదారులపై మరో దెబ్బ..గ్రేస్ పిరియడ్ లో ఉంటే ఇంటికే..

కాగా ఈ ట్వీట్‌ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన  పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారికి, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ' అని పోస్టులో పేర్కొన్నారు.

Also Read: Block Buster HHVM: సంధ్యా థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా..అప్రమత్తంగా పోలీసులు

Advertisment
తాజా కథనాలు