/rtv/media/media_files/2025/07/24/supreme-court-2025-07-24-14-03-12.jpg)
37 years after rape, Supreme court Sends convict, now 53 to Juvenile Justice Board
మైనర్‌గా ఉన్నప్పుడు ఓ బాలికపై అత్యాచారం చేసిన 53 ఏళ్ల నిందితుడి కోసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అతడిని జువైనల్ బోర్డుకు తరలించాలని ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1988లో రాజస్థాన్‌కు చెందిన ఓ మైనర్ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. గతంలోనే దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు.
Also Read: డిజిటల్ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్ కేటుగాడు
అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. చివిరికి నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడి తరఫున న్యాయవాది మాట్లాడుతూ నేరం చేసిన సమయంలో అతడు మైనర్ అని న్యాయస్థానానికి చెప్పారు.
Also Read: గుంటనక్క టర్కీ.. సాయం చేసిన భారత్ పై కుట్ర.. మరో భారీ మిస్సైల్?
ప్రస్తుతం అతడి వయసు 53 ఏళ్లు ఉందని చెప్పారు. అతడు మైనర్‌గా ఉన్నప్పుడు ఈ నేరం జరిగింది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు.. గతంలో ట్రయల్ కోర్టు విధించిన, హైకోర్టు సమర్థించిన మూడేళ్ల జైలు శిక్షను కొట్టివేసింది. అతడిని జువైనల్ బోర్డుకు అప్పగించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ బోర్డు నిందితుడిని మూడేళ్ల పాటు ప్రత్యేక నివాసంలో ఉంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.