Weather Update: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రాత్రంతా ఇక బాదుడే బాదుడు !

హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం పడుతోంది. అల్వాల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో ఎమర్జెన్సీ టీమ్‌లను అధికారులు అప్రమత్తం చేశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

హైదరాబాద్‌(Hyderabad) లో భారీ వర్షం(Heavy Rains) ప్రారంభమైంది. గత రాత్రి కురిసిన వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఇదే సమయానికి భారీ వర్షం కురిసింది. రాత్రి వరకు భారీగా కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు కూడా ఇదే సమయానికి వర్షం ప్రారంభం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.

Also Read :  రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన MLA రాజ్‌గోపాల్ రెడ్డి

ఈ ఏరియాల్లో భారీ వర్షాలు..

సికింద్రాబాద్, అల్వల్, ఖైరతాబాద్, శేరిలింగపల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్‌పల్లి, పటాన్ చెరువు, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, బేగం పేట, పారడైజ్, బోయిన్‌పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని లేకపోతే ఇంట్లోనే ఉండాలని తెలిపారు. 

Also Read :  దసరాకు సొంతూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. TGSRTC కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు