/rtv/media/media_files/2025/08/30/mla-komatireddy-rajgopal-reddy-2025-08-30-11-18-02.jpeg)
మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ గతకొన్ని రోజులు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై ఆయన గురువారం మీడియాకు క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి వెళ్తూ.. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు, సోషల్ మీడియాలో అవాస్తవాలు వ్యాపింపజేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇప్పట్లో అయ్యేది కాదు, పోయేది కాదు
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 17, 2025
ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి నేనుంటనో, నువ్వుంటనో.. ఎవరికీ తెలీదు
ఎన్ని తరాలు మారాలో.. ఎన్ని ప్రభుత్వాలు మారాలో కూడా తెల్వదు
ప్రస్తుతానికి మీ భూములు మీరు దున్నుకొని దర్జాగా బ్రతకండి
- పుట్టపాక RRR భూ బాధితులతో… pic.twitter.com/lV4GhEH9xn
రాజీనామాపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని ఇలా రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పానని రాజ్ గోపాల్ రెడ్డి వివరించారు. అలా చెప్తే తప్పేంటి? ఇప్పుడు కూడా ఓ ప్రైవేటు కార్యక్రమానికి గుంటూరు వెళ్తుంటే.. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని రూమర్స్ పుట్టిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతానన్నారు. అప్పటి వరకు ఈ దుష్ప్రచారాలు నమ్మొద్దని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.